Facebook & Instagram

Facebook & Instagramతో మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోండి

మీ కస్టమర్‌లు ఉన్న చోటే మార్కెటింగ్ చేయండి, విక్రయించండి

మీకు Shopify స్టోర్ లేదా? ఉచితంగా ప్రారంభించండి, ఆపై మీ మొదటి 3 నెలల పాటు నెలకు ₹20 చెల్లించండి.

ముత్యపు చెవికమ్మలు, నెక్లెస్ ధరించిన ఒక యువతి ఉన్న Instagram స్టోరీ, దానిపైన చెవికమ్మల ఉత్పత్తి లేబుల్ ఓవర్‌లే చేయబడి ఉంటుంది. Cadette Jewelry వ్యాపారికి చెందిన Instagram Shop ఫీడ్‌లో అమ్మకానికి ఉన్న జ్యువెలరీ ఉత్పత్తులను చూపించే ఇంటర్‌ఫేస్ పైన ‘షాప్ చూడండి’ (View shop) బటన్ ఉంటుంది.

మీ కస్టమర్‌లు ఉన్న చోటే మీరు కూడా ఉండండి

అనేకమంది సంభావ్య కస్టమర్‌లకు మీ ఉత్పత్తులను చేరువ చేయండి. వారు మీ ఉత్పత్తులను ఎక్కడైతే చూస్తారో అక్కడి నుండే నేరుగా చెక్‌అవుట్ చేసే వీలు కల్పించండి.

మీ యాడ్స్ ద్వారా ప్రభావాన్ని చూపండి

యాడ్స్‌పై వెచ్చించే ఖర్చుకు తగ్గ రాబడిని పెంచే శక్తివంతమైన విక్రయ, విశ్లేషణ సాధనాలతో మీ ఉత్పత్తులను ప్రదర్శించండి, వాటి పనితీరును ఆప్టిమైజ్ చేయండి.

Shopify ద్వారా నిర్వహించండి

మీ ఉత్పత్తులను సింక్ చేయండి, రియల్ టైమ్ అప్‌డేట్‌లను పొందండి, అలాగే మీ Shopify అడ్మిన్ నుండే ప్రొడక్ట్ ట్యాగ్‌లను, షాపబుల్ పోస్ట్‌లను సులభంగా సృష్టించండి.

ఫలితాలను రాబట్టే మర్చండైజింగ్

శక్తివంతమైన మర్చండైజింగ్ టూల్స్‌తో మీ ఉత్పత్తులను ఆకర్షణీయమైన రీతిలో ప్రదర్శించండి.
బంగారు చెవికమ్మలు మరియు ముత్యపు నెక్లెస్ ధరించిన ఒక యువతి ఉన్న Instagram స్టోరీ. దానిపైన ఓవర్‌లే చేయబడిన ఉత్పత్తి లేబుల్‌తో Cadette Jewelryకి చెందిన Alma చెవికమ్మలను ప్రదర్శించే ఒక ప్రొడక్ట్ కార్డ్.

అద్భుతమైన షాపింగ్ అనుభవాలను సృష్టించండి

ప్రొడక్ట్ ట్యాగ్‌లు, కస్టమైజ్ చేయగల ఉత్పత్తి వివరాల పేజీల ద్వారా కొత్త కస్టమర్‌లు మీ ఉత్పత్తులను కనుగొని, అన్వేషించేలా చేయండి.

లాంచ్ గురించిన ఆసక్తిని రేకెత్తించండి

ఎక్స్‌క్లూజివ్ ఉత్పత్తుల వివరాలను ముందుగానే తెలియజేయడం, వాటిని కొనుగోలు చేయడానికి రిమైండర్‌లను సెట్ చేసుకునేలా కస్టమర్‌లను అనుమతించడం ద్వారా మీ ప్రొడక్ట్ లాంచ్‌లపై ఆసక్తిని పెంచండి.

కన్వర్షన్‌ను పెంచుకోండి

ఇంటిగ్రేటెడ్ చెక్‌అవుట్ ద్వారా కస్టమర్‌లు మీ ఉత్పత్తులను ఎక్కడైతే కనుగొంటారో అక్కడి నుండే వాటిని కొనుగోలు చేయడాన్ని మరింత సులభతరం చేయండి.

విక్రయాలను పెంచుకోండి, యాడ్స్ పనితీరును మెరుగుపరచండి

Facebook, Instagramలలో మీ యాడ్స్ కోసం శక్తివంతమైన విక్రయ, విశ్లేషణ, కన్వర్షన్ టూల్స్‌ను ఉపయోగించుకోండి.

మీ ఉత్పత్తి కేటలాగ్‌ను సింక్ చేయండి

మరింత మంది సంభావ్య కస్టమర్‌లు చూసేలా యాడ్స్, షాపబుల్ కంటెంట్‌ను సులభంగా సృష్టించడానికి మీ ఉత్పత్తులను Shopify నుండి నేరుగా యాడ్స్ మేనేజర్‌కి సింక్ చేయండి.

యాడ్ పనితీరు, కొలమానాలను ఆప్టిమైజ్ చేయండి

యాడ్ టార్గెటింగ్‌ను మెరుగుపరచడానికి, సముపార్జనకయ్యే ఖర్చును తగ్గించడానికి, ఫలితాలను మెరుగ్గా అంచనా వేయడానికి Conversions APIని ఉపయోగించండి, అలాగే Meta పిక్సెల్‌ను సెటప్ చేయడం ద్వారా యాడ్‌పై చేసే ఖర్చుకు తగ్గ రాబడిని పొందండి.

Shop Payతో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి

కస్టమర్‌లు Facebook లేదా Instagram నుండి బయటకు రాకుండానే కొనుగోలు చేయగలిగేలా Shop Pay యొక్క వేగవంతమైన, అనువైన, వన్-ట్యాప్ చెక్‌అవుట్‌ని అందించి, వారి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి.
బంగారు ముత్యపు చెవికమ్మలు ధరించిన ఒక యువతి ఉన్న Instagram స్టోరీ. చెల్లింపు పద్ధతులను చూపే ఒక ఇంటర్‌ఫేస్. Cadette Jewelryకి చెందిన రెండు జతల చెవికమ్మలు ఉన్న ప్రొడక్ట్ టైల్స్.

డిస్‌క్లైమర్

ఛానెల్ ఫీచర్‌లు ప్రాంతీయ లభ్యతకు లోబడి ఉంటాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు

Facebook, Instagramలో విక్రయించడానికి నాకు Shopify అవసరమా?

లేదు, Instagram, Facebookలలో విక్రయించడానికి మీకు Shopify అవసరం లేదు. అయినప్పటికీ, Shopify వ్యాపారులు తమ ఇన్వెంటరీ, కస్టమర్, విక్రయాల డేటాను Facebook, Instagram, Shopify మధ్య వేగంగా సింక్ చేయగలరు. మీరు ఇంటర్నెట్ అంతటా మీ వ్యాపారం యొక్క విక్రయాలన్నింటినీ ఒకే చోట నిర్వహించవచ్చు—అదే Shopify అడ్మిన్.

Facebook, Instagramలలో విక్రయాలను నిర్వహించడానికి నేను Shopifyని ఎలా ఉపయోగించగలను?

మీ ఉత్పత్తి కేటలాగ్‌ను Facebook లేదా Instagramకి సింక్ చేయడానికి, మీ Shopify ఖాతాను మీ Facebook లేదా Instagram ఖాతాలతో కనెక్ట్ చేయండి. ఆ తర్వాత, Facebook యాడ్స్ మేనేజర్ ఉపయోగించి మీరు సృష్టించే యాడ్ క్యాంపెయిన్‌ల ద్వారా కొత్త కస్టమర్‌లను కనుగొనండి. మీ యాడ్స్, సోషల్ పోస్ట్‌ల ద్వారా విక్రయాలు జరగడం ప్రారంభించిన తర్వాత, మీరు Shopifyలోనే ఆర్డర్‌లు, చెల్లింపులు, రిటర్న్‌లను నిర్వహించగలుగుతారు.

Shopifyతో Facebook మరియు Instagramలో విక్రయించడానికి ఎంత ఖర్చవుతుంది?

మీ Shopify ప్లాన్‌లో భాగంగా ఈ ఛానెల్‌లు చేర్చబడినందున, Shopify ద్వారా Facebook, Instagramలలో మీ ఉత్పత్తులను లిస్ట్ చేయడం ఉచితం. మీరు ఉపయోగించే Shopify Payments లేదా ఇతర పేమెంట్ ప్రొవైడర్‌కు సంబంధించిన ఏవైనా రుసుములు, మీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా చేసిన విక్రయాలకు వర్తించే విధంగానే వీటికి కూడా వర్తిస్తాయి.

నేను Facebook, Instagramల నుండి వచ్చే ఆర్డర్‌లను ఎలా నిర్వహించాలి?

Facebook, Instagramలలో ప్లేస్ చేయబడిన ఆర్డర్‌లు, రిటర్న్‌లు, రీఫండ్‌లు అన్నీ కూడా మీ వెబ్‌సైట్ ఆర్డర్‌ల్లాగానే నిర్వహించబడతాయి. మీరు ఈ ఆర్డర్‌లకు సంబంధించిన పేఅవుట్‌లు, ఆర్థిక నివేదికలను మీ ఇతర ఆర్డర్‌లతో పాటు మీ Shopify అడ్మిన్‌లో చూడవచ్చు.

Facebook & Instagramలో విక్రయించడం ప్రారంభించండి

మీకు Shopify స్టోర్ లేదా?