Shopify Tax Platform
ఎలాంటి రాజీ లేకుండా
అమ్మకపు పన్ను సమ్మతి
మీకు ఇష్టమైన అమ్మకపు పన్ను సేవను Shopifyకి కనెక్ట్ చేయండి, తద్వారా మీ వ్యాపారానికి సరిపోయే ఉత్తమ పరిష్కారంతో మీరు నిబంధనలను సులభంగా పాటించవచ్చు.
మీకు Shopify స్టోర్ లేదా? ఉచిత ట్రయల్ ప్రారంభించండి
అమ్మకపు పన్ను ఆటంకాలను తొలగించండి
బహుళ అమ్మకపు పన్ను పరిష్కారాలను నిర్వహించే ఖర్చు, రిస్క్ లేకుండా Shopifyకి మారండి.
మీకు ఇష్టమైన పన్ను సేవను ఉంచుకోండి
నమ్మకమైన పన్ను భాగస్వాములతో Shopify తన అనుబంధాన్ని విస్తరిస్తోంది. కాబట్టి మీకు నమ్మకమున్న పాత పన్ను సేవలనే కొనసాగించవచ్చు లేదా మీ వ్యాపార అవసరాలకు సరిపోయే కొత్త సేవనైనా ఎంచుకోవచ్చు.
ఇన్‌బిల్ట్ పన్ను లెక్కింపులతో కూడిన
Shopify చెక్అవుట్ను ఉపయోగించండి
ప్రపంచంలోనే అత్యుత్తమ కన్వర్షన్ సాధించే చెక్‌అవుట్‌తో* పాటు అత్యంత కచ్చితమైన పన్ను లెక్కింపులు, మినహాయింపుల నిర్వహణ, ఇంకా ఇన్సైట్లను కూడా పొందండి.
అదనపు పనుల భారం నుండి
మీ బృందానికి ఉపశమనం ఇవ్వండి
మీ అమ్మకపు పన్ను అవసరాలన్నింటినీ ఒకే చోట నిర్వహించండి. వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లలో ఖాతాలను బ్యాలెన్స్ చేయడం లేదా వర్క్‌ఫ్లోలను నిర్వహించడం వంటి శ్రమ ఇక ఉండదు.
*బిగ్ త్రీ గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ భాగస్వామ్యంతో ఏప్రిల్ 2023లో పూర్తయిన అధ్యయనం ఆధారంగా.
Shopify Tax Platform భాగస్వాములు
మీరు ఆధారపడగలిగే దీర్ఘకాలిక ఇంటిగ్రేషన్లను రూపొందించడానికి, మేము అత్యంత విశ్వసనీయ అమ్మకపు పన్ను సేవలతో కలిసి పనిచేస్తున్నాము. త్వరలో మరిన్ని భాగస్వామ్యాలు అందుబాటులోకి రానున్నాయి.

Vertex
Vertex, Inc. అనేది Shopify వ్యాపారాల కోసం నమ్మకమైన, కచ్చితమైన, గ్లోబల్ పరోక్ష పన్ను మరియు సమ్మతి పరిష్కారాలను అందిస్తుంది. B2B, B2C అమ్మకాల కోసం విక్రయాలు, విక్రేత వినియోగ పన్ను (SUT), వస్తు సేవల పన్ను (GST), విలువ ఆధారిత పన్ను (VAT) లెక్కింపును ఆటోమేట్ చేయడం ద్వారా రిటైలర్లు లావాదేవీలు, పన్ను సమ్మతి గురించి నిశ్చింతగా ఉంటూ నమ్మకంగా వృద్ధి చెందవచ్చు.
Avalara
అన్ని రకాల పరిశ్రమల వ్యాపారాలు, పన్ను సమ్మతిని సక్రమంగా పాటించేలా Avalara సహాయపడుతుంది. ఇది పన్ను లెక్కింపు, టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్, రెమిటెన్స్, వివిధ పన్నుల మినహాయింపు పత్రాల నిర్వహణ వంటి క్లౌడ్-ఆధారిత సమ్మతి పరిష్కారాలను అందిస్తుంది. మా Avalara for Shopify ఇంటిగ్రేషన్ U.S. అమ్మకపు పన్ను, VAT వంటి గ్లోబల్ పన్నుల లెక్కింపునకు, అంతర్జాతీయ విక్రయ సామర్థ్యాలను మెరుగుపరచడానికి మద్దతివ్వడంతో పాటు, బహుళ ఛానెల్‌ల నుంచి లావాదేవీల డేటాను ఒకచోట చేరుస్తుంది.
US కోసం మాత్రమే
Shopify Tax
Shopify Tax USలో అమ్మకపు పన్ను సమ్మతిని సులభతరం చేస్తుంది, తద్వారా వ్యాపారాలకు సమయం, డబ్బు ఆదా అవుతుంది. చిరునామా-ఆధారిత పన్ను రేట్ల లెక్కింపు, నెక్సస్ ట్రాకింగ్, ఇంకా వివరణాత్మక నివేదికలన్నీ నేరుగా మీ Shopifyలో ఇంటిగ్రేట్ అయి వస్తాయి.నిరాకరణ:
అంతర్జాతీయ వ్యాపారాలు తమ US అమ్మకపు పన్ను అవసరాలను నిర్వహించడానికి Shopify Taxను ఉపయోగించుకోవచ్చు. పేజీ ఆంగ్లంలో మాత్రమే ఉంది.
అంతర్జాతీయ వ్యాపారాలు తమ US అమ్మకపు పన్ను అవసరాలను నిర్వహించడానికి Shopify Taxను ఉపయోగించుకోవచ్చు. పేజీ ఆంగ్లంలో మాత్రమే ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు
ప్రారంభించండి
మీకు Shopify స్టోర్ లేదా? ఉచిత ట్రయల్ ప్రారంభించండి