ఉచిత సాధనాలు
మా BOL టెంప్లేట్‌తో షిప్పింగ్‌ను సులభతరం చేయండి
అంతరాయం లేని అంతర్జాతీయ వాణిజ్యం
అంతర్జాతీయ షిప్‌మెంట్‌లు, యాజమాన్య హక్కుల బదిలీలు సాఫీగా సాగేందుకు ప్రతిసారీ ఖచ్చితమైన బిల్స్ ఆఫ్ లాడింగ్‌ను జారీ చేయండి. స్పష్టమైన, కచ్చితమైన డాక్యుమెంట్‌లు క్లియరెన్స్ ప్రక్రియలను సులభతరం చేస్తూ వేగవంతం చేస్తాయి, తద్వారా కస్టమ్స్ అధికారులతో పాటు మీ కస్టమర్లకూ సంతృప్తిని అందిస్తాయి.
ఈ ఉచిత బిల్ ఆఫ్ లాడింగ్ టెంప్లేట్, ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ప్రింటబుల్ మరియు ఎలక్ట్రానిక్ BoL ఫారమ్‌లను రూపొందిస్తుంది. ప్రపంచంలో ఎక్కడికైనా సరుకులను రవాణా చేయడానికి మీరు దీన్ని ఉపయోగించవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు
బిల్ ఆఫ్ లాడింగ్ అనేది రవాణా అయ్యే సరుకులతో పాటు ఉండే ఒక డాక్యుమెంట్, ఇది పంపేవారికి మరియు క్యారియర్‌కు మధ్య ఉన్న ఒప్పందాన్ని తెలియజేస్తుంది, అలాగే వస్తువులు రవాణా అయ్యే సమయంలో వారి బాధ్యతలను నిర్దేశిస్తుంది. ఇది షిప్‌మెంట్‌లోని కార్గోకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతుంది, అలాగే డాక్యుమెంట్‌లో పేర్కొన్న స్వీకర్తకు ఆ షిప్‌మెంట్‌పై యాజమాన్యం లేదా హక్కులను బదిలీ చేస్తుంది. ఆ స్వీకరించే పార్టీ సాధారణంగా కార్గో పొందుతున్న సంస్థ లేదా వ్యక్తి అయి ఉంటారు.
షిప్‌మెంట్‌ను పికప్ చేసుకున్నప్పుడు క్యారియర్ ఈ బిల్ ఆఫ్ లాడింగ్‌పై సంతకం చేస్తారు. ట్రక్కు, రైలు, విమానం లేదా ఓడ ద్వారా రవాణా చేయడానికి క్యారియర్‌కు సరుకులు అందినట్లు ఈ సంతకం ధృవీకరిస్తుంది. స్వీకర్త (దీనిని తరచుగా “కన్సైన్ (consignee)” అని పిలుస్తారు) సంతకం చేసినప్పుడు, బిల్ ఆఫ్ లాడింగ్‌లో వివరించిన విధంగానే వస్తువులను అందుకున్నామని నిర్ధారించినట్లు అవుతుంది. ఇది డెలివరీ రుజువుగా కూడా పనిచేస్తుంది.
Shopifyకి చెందిన ఉచిత బిల్ ఆఫ్ లాడింగ్ ఫారమ్‌ను ఉపయోగించడం చాలా సులభం మరియు వేగవంతమైనది, ప్రారంభించడానికి:
- బిల్ ఆఫ్ లాడింగ్ టూల్‌కి వెళ్లండి
- ఆన్‌లైన్ ఫారమ్‌లో మీ సమాచారాన్ని నమోదు చేయండి
- “సమర్పించండి” మీద క్లిక్ చేయండి
- మీ ఇన్‌బాక్స్‌కు Shopify నుండి బిల్ ఆఫ్ లాడింగ్ ఇమెయిల్ వచ్చే వరకు వేచి ఉండండి
- “మీ బిల్ ఆఫ్ లాడింగ్‌ను ఇప్పుడే పొందండి” లింక్‌పై క్లిక్ చేయండి
- “PDFను డౌన్‌లోడ్ చేయండి” మీద క్లిక్ చేయండి
Shopify అందించే ఈ బిల్ ఆఫ్ లాడింగ్ టూల్‌ను వ్యాపారాలన్నీ మరియు ప్రతి పారిశ్రామికవేత్త ఉచితంగా ఉపయోగించవచ్చు.
మీరు జాతీయంగా లేదా అంతర్జాతీయంగా వస్తువులను షిప్పింగ్ చేస్తున్న ప్రతిసారీ బిల్ ఆఫ్ లాడింగ్ అనేది అవసరం. సాధారణంగా, రెండు రకాల బిల్ ఆఫ్ లాడింగ్‌లు ఉంటాయి:
- స్ట్రెయిట్ బిల్ ఆఫ్ లాడింగ్ – ముందుగానే షిప్‌మెంట్ కోసం చెల్లింపు జరిగినప్పుడు మరియు క్యారియర్ ద్వారా సరుకులను కొనుగోలుదారుకు లేదా సరైన పార్టీకి డెలివరీ చేస్తున్నప్పుడు దీనిని ఉపయోగిస్తారు.
- ఆర్డర్ బిల్ ఆఫ్ లాడింగ్ – వస్తువులకు చెల్లింపులు జరగకముందే వాటిని షిప్పింగ్ చేస్తున్నప్పుడు దీనిని ఉపయోగిస్తారు. దీన్ని బిల్ ఆఫ్ లాడింగ్‌పై “టు ఆర్డర్ ఆఫ్ (to order of)” అని పేర్కొని, ఆ తర్వాత స్వీకర్త పేరును ఉంచుతారు. ఆర్డర్ బిల్లును “నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్”గా పరిగణిస్తారు, అంటే ఇది డబ్బుకు ప్రత్యామ్నాయంగా లేదా చెల్లిస్తామనే హామీగా పనిచేస్తుంది. వస్తువులను ఓపెన్ అకౌంట్ లేదా లెటర్ ఆఫ్ క్రెడిట్ కింద షిప్ చేస్తున్నట్లయితే, ఆర్డర్ బిల్ ఆఫ్ లాడింగ్‌ను ఉపయోగించవచ్చు.
అవును, మీరు ప్రింట్ చేయవచ్చు! కేవలం PDFను డౌన్‌లోడ్ చేసి, బిల్ ఆఫ్ లాడింగ్‌ను ప్రింట్ చేసుకోండి.